హైదరాబాద్ , తెలంగాణ, 19 సెప్టెంబర్ 2025:
గ్లెనీగల్స్ హాస్పిటల్స్ భారతదేశ వైద్య చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఆధునిక వైద్య శాస్త్ర చికిత్సలను అందిపుచ్చుకుంటూ 15 రోజుల వ్యవధిలోనే మూడు క్లిష్టమైన లంగ్ ట్రాన్స్ ప్లాంట్స్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని ప్రకటించారు. ఈ శస్త్ర చికిత్సలు హైదరాబాద్, చెన్నై, మరియు బెంగళూరు నగరాలలో నిర్వహించామన్నారు. టీబీ కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, లివర్ ట్రాన్స్ ప్లాంట్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి లంగ్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామన్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుల బృందం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఘనతను సాధించగలిగామన్నారు. శస్త్ర చికిత్స తర్వాత ముగ్గురు రోగులు పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ ఆధునిక ప్రక్రియలకు డాక్టర్ బాలసుబ్రమణ్యం గోవిని నాయకత్వం వహించారు. సంక్లిష్టమైన వ్యాస్కులర్ మరియు బ్రాంకియల్ అనస్టోమోసిస్ సవాళ్లతో కూడిన కేసులను మూడు గంటల కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. దాత అవయవం సకాలంలో సమన్వయం చేయడం, వేగవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పాటు, ఇస్కిమిక్ సమయాన్ని ఘననీయంగా తగ్గించి రోగి మనుగడ అవకాశాన్ని పెంచడానికి ఈ బృందం 600 కిలోమీటర్ల పైగా ప్రయాణించింది.
శుక్రవారం గ్లెనీగల్స్ హాస్పిటల్స్ లకిడికపూల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్లెనీగల్స్ హాస్పిటల్స్ లీడ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ బాలసుబ్రమణ్యం గోవిని మాట్లాడుతూ హాస్పిటల్ ట్రాన్స్ ప్లాంట్ నిపుణుల బృందం కృషి, ఆధునిక వైద్య సేవలను ఉపయోగించి రోగికి మెరుగైన వైద్య సేవలను అందించడంలో అంకితభావం ఈ శస్త్ర చికిత్సలు విజయవంతం అవ్వడానికి కారణం అన్నారు. రికార్డు సమయంలో సంక్లిష్టమైన అనస్టోమోసిస్ ను పూర్తి చేయడం మా శస్త్ర చికిత్స నైపుణ్యం మరియు సమిష్టి పట్టుదలకు నిదర్శనం అన్నారు.
గ్లెనీగల్స్ హాస్పిటల్స్ లంగ్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ అపర్ జిందాల్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎంతో బాధ అనుభవిస్తూ కూడా సాటివారి ప్రాణాలు కాపాడేందుకు ధైర్యం మరియు కరుణతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అమూల్యమైన అవకాశాన్నిచ్చిన దాతల కుటుంబాలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వారి నిస్వార్ధ సేవ మరొకరి ప్రాణాలు కాపాడడమే కాదు దాదాపుగా ఆశలు వదులుకున్న మొత్తం కుటుంబాన్ని నిలబెట్టగలిగారన్నారు
గ్లెనీగల్స్ హాస్పిటల్స్ లకిడికపూల్ ట్రాన్స్ ప్లాంట్ పల్మొనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ మాట్లాడుతూ శస్త్ర చికిత్సలు విజయవంతం అవ్వడానికి సర్జన్లు, శస్త్ర చికిత్స నిపుణులు, అనస్తీసియా నిపుణుల బృందం మరియు సహాయక సిబ్బంది సమిష్టి కృషి ఇందుకు కారణమన్నారు. ప్రతి రోగి ఆక్సిజన్ లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేలా చేయడమే మా లక్ష్యం అన్నారు.
డాక్టర్ ఒబుల్ రెడ్డి మా సంస్థలో మంచి ప్రీ ఆపరేటివ్ నిర్వహణ, దాత నిర్వహణ ప్రోటోకాల్స్ మరియు ఆపరేషన్ తర్వాత కేర్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తున్నారు, ఇది రోగికి అత్యంత ముఖ్యమైనది అని చెప్పారు.
భారతదేశంలో ఆధునిక అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలో గ్లెనీగల్స్ హాస్పిటల్స్ స్థానాన్ని ముందంజలో ఉంచడానికి ఈ విజయాలు దోహదపడతాయి. విలేకరుల సమావేశంలో డాక్టర్ అపర్ జిందాల్, డాక్టర్ అజయ జోషి, డాక్టర్ ఓబుల్ రెడ్డి, డాక్టర్ శరణ్య కుమార్, డాక్టర్ చైతన్య మరియు డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.